మీ బ్రొటనవేలి సహాయముతో ఇప్పటినుండి మీ జీవితకాలం రహస్యాన్ని చెప్పేదే ఈ జ్యోతిష్యం . ఈ జోష్యం తాళపత్ర గ్రంధములో రచించి ఉండటం ఒక విశేషం. మీ బ్రొటనవేలి సహాయముతో (స్త్రీలకు ఎడమ పురుషులకు కుడి ) మీకు సంబందించిన నాడిని వెదికి మీ జీవిత చరిత్రను చెప్పడం జరుగుతుంది . ఈ నాడిలో ముఖ్యంగా 12 కాండాలు ఉంటాయి. అందులో
1. జనరల్ కాండం : మీ పేర్లు, తల్లితండ్రుల పేర్లు, భార్య పేరు, ఇప్పటి పరిస్థితి, ఉద్యోగ వివరాలు, అన్నదమ్ముల సంఖ్య, అక్క చెల్లెళ్ళ సంఖ్య, పిల్లల వివరాలు, జీవితము చివరి వరకు మొత్తం ౧౨ కాండముల వివరములు తెలుపబడును.
2. డబ్బు, చదువు, కళ్ళు, కుటుంబము.
3. అన్నదమ్ముల సంఖ్య,అక్క చెల్లెళ్ళ సంఖ్య, వారి భవిష్యత్తు, ఐకమత్యము, డబ్బు సహాయం, ఆస్తి, వ్యాపారము, భవిష్యత్తులో అందరు కలిసి ఉంటారా లేక విడిపోతారా.
4. తల్లి వివరాలు, ఇల్లు, వాహనము, స్థలము వివరాలు, ఇల్లు కట్టే ప్రాప్తం ఉందా, స్థల ప్రాప్తం ఉందా అనేది ఇందులో తెలుస్తుంది. జీవితంలో సంతోషంగా ఉంటారా లేదా అనేది కూడా తెలుస్తుంది.
5. పిల్లలు, భవిష్యత్తులో పిల్లలు పుట్టడం,పిల్లలు కలగనంత వరకు కారణాలు, కలగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల భవిష్యత్తు, ఎంత మంది పిల్లలు పుడతారు, అసలు పుడతారా లేదా అనే వివరాలు ఉంటాయి.
6. జబ్బులు, కోర్ట్ కేసులు, విరోధాలు-వీటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
7. వివాహము, వివాహమునకు వయసు, లగ్నము, పెళ్లికొడుకు, పెళ్లికూతురు, నివాసమునకు సమీప గుర్తులు భవిష్యత్తులో వివాహానంతరం వారితో కలిసి నడవబోయే జీవితం వంటి వివరాలు ఉంటాయి.
8. జీవితకాలం, ప్రమాదాలు
9. తండ్రి, తండ్రి భవిష్యత్తు, అదృష్టం, గుడి దర్శనము, గుడి నిర్మాణ ప్రాప్తం, గురూజీ ఉపదేశం.
10. ఉద్యోగం, వ్యాపార భవిష్యత్తు, స్థల మార్పిడి, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి చెడులు.
11. ధనలాభం, రెండవ వివాహం దాని వలన లాభాలు.
12. డబ్బు ఖర్చు, విదేశీ పర్యటన, మరో జన్మ, నిద్ర భాగ్యం, మోక్షం ఉన్నదా !
1. శాంతి కాండం : పూర్వ జన్మ వివరాలు, పూర్వ జన్మలో మనం చేసిన పాపాలకు పరిహారం చుచించేదే శాంతి కాండం
2. దీక్షా కాండం : మంత్ర జపం, రక్షా కట్టుకోవడం, శత్రువుల నుండి, భాదల నుండి రక్షణ కలగడాన్ని తెలుపుతారు.
3. ఔషధ కాండం : దీర్ఘకాల రోగాలకు, ఎంతకీ నయంకాని ఎటువంటి జబ్బుకైనా ఔషధాన్ని తెలుపుతారు.
4. దశభుక్తి కాండం : ఇప్పుడు నడుస్తున్న దశ గురుంచి ఫలితాలు చెపుతారు .
సూచనా : 1. శివనాడి తుల్లియ, శివనాడి సూక్ష్మం నాడి కుడి అందుబాటులో ఉన్నవి . రాజకీయ సౌఫల్యత,రాజకీయ పొత్తులు మొదలగువాటికి ప్రత్యేక కాండం, ప్రశ్నకాండం, దశభుక్తి కాండం కూడా కలవు.
2. ఫోన్ చేసి ముందుగా అపాయింట్ మెంట్ తీసుకొని వచ్చిన వారికీ మాత్రమే నాడి జ్యోతిష్యం చెప్పబడును.